![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2 (Karthika Deepam2 )'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-634 లో.. జ్యోత్స్నకి తగిలి శౌర్య పడిపోవడంతో జ్యోత్స్న మీద పారిజాతం సీరియస్ అవుతుంది. శౌర్యకి సారీ చెప్పాలని పారిజాతం డిమాండ్ చేస్తుంది. దానికి జ్యోత్స్న నిరాకరిస్తుంది. ఇక పారిజాతం పట్టుబట్టి శౌర్యకి జ్యోత్స్న సారీ చెప్పేలా చేస్తుంది. ఇక ఆ తర్వాత జ్యూస్ తీసుకొస్తుంది పారిజాతం. ఇక ఇదే మంచి సమయం అనుకొని కార్తీక్ పారిజాతాన్ని ఇరికించాలని చూస్తాడు.
జ్యూస్ నీ మనవరాలికే ఇస్తావ్ కదా పారిజాతం అనగానే హా అవును అని దీపకి ఇస్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. నీ మనవరాలు జ్యోత్స్న కదా.. దీపకి ఎందుకు ఇచ్చావని శ్రీధర్, కార్తీక్ లతో పాటు అందరు అడుగుతారు. నా మనవడు కార్తీక్ ని చేసుకుంది కాబట్టి తను కూడా నా మనవరాలే.. పైగా తను కడుపుతో ఉందని పారిజాతం కవర్ చేస్తుంది. జ్యోత్స్న కోపంతో రగిలిపోతుంది. గ్రానీకీ మా అమ్మ మీద అంత ప్రేమ ఎందుకొచ్చిందని శౌర్య అనగానే అదే నేను తెలుసుకోవాలని జ్యోత్స్న అనుకుంటుంది. ఇక దీప పైన జ్యూస్ తాగుతుంటే అక్కడికి జ్యోత్స్న వస్తుంది. మా అమ్మనాన్మలని మీ అమ్మనాన్నలని అనుకోని ఉండు అని జ్యోత్స్న అనగానే అనుకోనా అని దీప అంటుంది. ఇప్పటికీ అనుకోమని అనగానే సరే అని దీప వెళ్ళిపోతుంది. నీ చావుకి ముహూర్తం పెట్టే ఈ పార్టీ పెట్టాను.. నీ ఫోటోకి దండేసే కార్యక్రమం సిద్దంగా ఉంది. నువ్వు చావడానికి రెడీగా ఉండు దీప అని జ్యోత్స్న అనుకుంటుంది. మరోవైపు శౌర్యకి చాక్లెట్స్ ఇస్తుంది పారిజాతం. ఆ తర్వాత తనని జ్యోత్స్న గదిలోకి తీసుకెళ్ళి తన బెడ్ పై ఆడిస్తుంది. అక్కడే కొన్ని పేపర్లు కనిపిస్తాయి . తనకి చదువు రాదు కాబట్టి శౌర్యని చదవమని అంటుంది. కానీ తను చదవలేదు.
ఇక జ్యోత్స్నని అడిగితే చెప్పదు అని అనుకొని అప్పుడే అటుగా కార్తీక్ వస్తుంటే అతడిని అడుగుతుంది. కార్తీక్ ఆ రిపోర్ట్స్ చూసి షాక్ అవుతాడు. అందులో జ్యోత్స్న, సుమిత్ర, దీప డీఎన్ఏ సాంపిల్స్ రిపోర్ట్స్ ఉంటాయి. అంటే జ్యోత్స్న నిజం తెలుసుకుంది. ఏదో ప్లాన్ తో ఉందని కార్తీక్ అనుకుంటాడు. అదే సమయంలో జ్యోత్స్న వస్తుంటుంది. దాంతో పారిజాతం లోపలికి వెళ్ళి ఎక్కడి రిపోర్ట్స్ అక్కడే పెట్టి వస్తుంది. మా గ్రీనీకి ఏం చెప్పావ్ బావ తను అలా చేస్తుందని కార్తీక్ ని జ్యోత్స్న అడుగగా.. ఏం చెప్పలేదని కార్తీక్ అంటాడు. నీతో తర్వాత మాట్లాడుతాను బావ అని చెప్పేసి జ్యోత్స్న తన గదిలోకి వెళ్తుంది. అక్కడ రిపోర్ట్స్ చూసి.. గ్రానీ ఎందుకు వచ్చింది.. చూసిందా.. నాకు అవమానం వచ్చిందంటే నేను అనుకున్నది చేయాల్సిన టైమ్ వచ్చిందన్నమాట.. దీప ఎక్కడున్నావమ్మా అని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |